ఆయన చెబితే రాజధాని ఇక్కడి నుంచి కదిలే అవకాశం లేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబితే రాజధాని ఇక్కడి నుంచి కదిలే అవకాశం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్మే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాజధాని అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైసీపీ ప్రభుత్వం కదిలించలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయన్నారు. రాజధాని అమరావతి 29 గ్రామాలది కాదు, ప్రపంచంలోని కోట్లాది తెలుగువారిది అన్నారు. అమరావతి అప్పుడు ముద్దు, ఇప్పుడెందుకు కాదో జగన్ చెప్పాలన్నారు. జగన్ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారు అని అన్నారు.













