ఇటువంటి ఘటనలు ఎదురైతే.. చంద్రబాబు వెంటనే
మచిలీపట్నం మండలం క్యాంబెల్పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లిన గల్లంతయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ నేత కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోస్ట్ గార్డ్స్ పడవలు కూడా పంపించలేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అర్థమవుతుందన్నారు. వారి ఆచూకి కోసం ఎటువంటి చర్చలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో ఇటువంటి ఘటనలు ఎదురైతే చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. వారి ఆచూకీ కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉందన్నారు. సీఎం జగన్ స్పందించి అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ యంత్రాగాన్ని ఆదేశించాలని సూచించారు.













