ఇలాంటివాళ్లు పోతేనే.. పార్టీకి దరిద్రం వదులుతుంది
ఫోన్ ట్యాప్ చేసినవారిని దేశంలో ఎవరినైనా ఏమైనా చేయగలిగారా? ఒక్కటైనా నిర్దారణ అయిందా? అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటలిజెన్స్ అధిపతి, ఎమ్మెల్యేలం ప్రభుత్వంలో భాగం అని అన్నారు. కోటంరెడ్డి బయట మాట్లాడింది ఆయన దృష్టికి వస్తే ఇది జగన్ ప్రభుత్వం ఇలా మాట్లాడకండి ఇబ్బంది పడతారు అని పంపి ఉంటారు. అన్నీ ముఖ్యమంత్రే పిలిచి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాయకులందరి ఫోన్లను ట్యాప్ చేసి, ముఖ్యమంత్రి వింటూ కూర్చుంటారా? అని ప్రశ్నించారు. కోటంరెడ్డి గురించి పరోక్షంగా మాట్లాడుతూ చంద్రబాబు పనిచేయలేదనే కదా ఆయన్ను ప్రజలు ఓడిరచారు. ఇప్పుడు ఆయన పార్టీలోకి చేరి నియోజకవర్గాలకు వీళ్లేం మంచి చేస్తారు? ఇలాంటి వాళ్లు పోతేనే పార్టీకి దరిద్రం వదులుతుంది అని అన్నారు.













