తెలుగుదేశం పార్టీలో చేరిన కాండ్రు కమల
తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల ఉండవల్లిలోని ప్రజావేదికలో పెద్దెత్తున మంగళగిరి నుంచి కార్యకర్తలతో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన కమల కమలకు పచ్చ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించని సీఎం చంద్రబాబు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తెదేపాలో చేరిక
కాండ్రు కమల తెలుగుదేశంపార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నా …ఆమెతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ మార్కెటింగ్ చైర్మన్లు తెదేపా కండువా కప్పు కోవడం అభినందనీయం …అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా …మంగళగిరి మున్సిపాల్ చైర్మన్, శాసనసభ్యురాలిగా కమల ప్రజాసేవలో ప్రత్యేకతను నిలుపుకున్నారన్నారు. మీరు రావడం మంగళగిరిలో తెదేపా బలోపేతం అవుతుంది. రాజధాని ప్రాంతంలోని భాగం మంగళగిరి నియోజకవర్గం …అమరావతి రాజధాని నడిబొడ్డున ఉంది …అమరావతి రాజధానిలో జరుగుతున్నా అభివృద్ధికి మీరు ప్రత్యక్ష సాక్షులు.. అమరావతి బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంతున్నది ..ఒక రాజధాని ,ఒక నగరం నిర్మాణానికి ఇరవై, ముప్పయి ఏళ్ళు పడుతుంది. గతంలో హైదరాబాలో బ్రౌన్ ఫీల్డ్ సిటీని నిర్మించాను.. అమరావతిలో గ్రీన్ , బ్లూ ఫీల్డ్ రాజధాని నిర్మాణం జరుగుతోంది..
విజయవాడ, గుంటూరు, మంగళగిరి ,కృష్ణా నదికి మధ్య అపురూపంగా, అద్భుతంగా అమరావతి రాజధాని నిర్మాణం వేగామండుకుంది.. ప్రపంచంలో అయిదు సిటీల్లో ఒకటిగా అమరావతి నగరం నిలవనుందని స్పష్టంగా చెప్పగలను. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కేరాఫ్ అడ్రసుగా నిలుస్తుంది.. అభివృద్ధికి అడ్డుపడే పార్టీగా వైకాపా ప్రవర్తించడం జగమెరిగిన సత్యం. ప్రధాని మోడీ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదన్నారు. నేను రాత్రి పగలూ కష్టపడుతున్నానని అందర్నీ కష్టపెడుతున్నానని అందుకే ఏపీలో ఎక్కడా జరగని అభివృద్ధిని చూస్తున్నారన్నారు. అమరావతి , పోలవరం నిర్మాణాలను ఆడుకోవడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ఎపీకి జగన్, కేసీఆర్, మోడీ లు ముగ్గురూ మోదీలుగా అడ్డుపడాలని, కష్టపెట్టాలని యత్నిమ్చినా వారి ఆటలు సాగవన్నారు. రాష్ట్రానికి 670 అవార్డులు కేంద్రమే ఇచ్చింది అయితే రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు, నిధుల కేటాయింపులో అలసత్వం, నిర్లక్ష్యం చేయడం బాధాకరం …ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం, అండదండలు అందించాలి… రాన్నున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి రాష్ట్రంలోని 175శాసనసభ , 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రజల సహకరంతో ఓట్లు ఒకపక్షంగా వేసి తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కమల ను తెదేపాలోకి ఆహ్వానించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కమలతోపాటు పలువురికి తెదేపా కండువా కప్పి స్వాగతం పలికారు.
మంగళగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమంతరావు, గంజి చిరంజీవి, ఇతర నాయకులంతా కలసి అని చేసి తమ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు.













