కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత విజయం
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వర రావుపై కల్పలత విజయం సాధించారు. 6,153 ఓట్లు దాటిపోగానే ఈమె విజయం సాధించారని అధికారులు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికీ 6,153 ఓట్లు రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కల్పలతను విజేతగా అధికారులు ప్రకటించారు అయితే ఈ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో దిగారు. విజయం సాధించిన సందర్భంగా కల్పలత మాట్లాడుతూ… ‘‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.’’ అని కల్పలత పేర్కొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన విజయం సాధించారు. మొత్తం 17,467 మంది ఓట్లరుండగా… 16,054 ఓట్లు పోలయ్యాయి. షేక్ సాబ్జీకి 7,987 ఓట్లు వచ్చాయి. 1,534 ఓట్ల మెజారిటీతో సాబ్జీ విజయం సాధించారు.













