తనను ముఖ్యమంత్రిని చేస్తే…ఐదేళ్లలో అమెరికాలా ఏపీ
తనను ముఖ్యమంత్రిని చేస్తే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా తయారు చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. లేదంటే తిరిగి అమెరికా వెళ్లిపోతానన్నారు. విజయవాడలో పార్టీ మేనిఫెస్టోలో కొంతభాగాన్ని ఆయన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామన్నారు. ప్రతీ ఒక్కరికి ఉచితంగా వైద్యాన్ని అందించడంతోపాటు, రోగులకు ఎయిర్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రిని చేస్తే ఏడు లక్షల కోట్లు విరాళంగా తీసుకొచ్చి రెండున్నరలక్షల కోట్ల రాష్ట్ర అప్పును తీర్చేస్తా అని మేనిఫెస్టోలో పాల్ హామీ ఇచ్చారు.













