సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
వైకాపా అధినేత జగన్కు ఓటు వేస్తే మోదీ, కేసీఆర్కు వేసినట్టేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పునరుద్ఘాటించారు. భీమవరంలో ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను చూస్తే కేసీఆర్ పారిపోతాడన్నారు. కేసీఆర్ ముక్కు పిండేస్తానని, కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని అన్నారు. జనసేన గురించి మాట్లాడుతూ గుండు గీయించుకునే కాపుకు ఓటస్తారా? గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. పవన్, నాగబాబు అన్నీ ఇస్తామంటున్నారు ఎలా ఇస్తారు? ధనవంతురాలిని పెళ్లి చేసుకుని కట్నం తీసుకొచ్చి ఇస్తారా? అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.













