ఏపీ ఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) చైర్మన్గా జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి జస్టిస్ నాగార్జునరెడ్డిని శాలువాతో సత్కరించారు. జస్టిస్ నాగార్జునరెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.













