నేడు మరో 9 మంది అభ్యర్థులను ప్రకటించనున్న జనసేనాని..
ఆంధ్రాలో త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంలో బిజీగా ఉన్నాయి. పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేన తన ఖాతాలో 21 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు లోక్సభ స్థానాలను దక్కించుకుంది. అయితే ఇక ఇందులో ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది మాత్రం ప్రస్తుతానికి డైలమాలో ఉంది. సీట్లు సర్దుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన ముందుగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ ను అభ్యర్థిగా ప్రకటించాడు జనసేనాని. దీంతో మొత్తం ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 6 కు చేరుకోగా మరొక తొమ్మిది మంది పేర్లు కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈసారి జరగబోయే ఎన్నికలలో ఎలాగైనా సరే 21 స్థానాల నుంచి గెలిచి తీరాలి అని పవన్ తన అనుచరులకు సందేశాన్ని ఇచ్చారు.పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, ఎలమంచిలి నుంచి విజయ్ కుమార్, విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ,ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం – నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి రామాంజనేయులు, రాజోలు నుంచి దేవ వరప్రసాద్ ,తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసుల ను అభ్యర్థిత్వాలను జనసేనాని కన్ ఫాం చేశారని టాక్. ఈరోజు అధికారికంగా ఈ పేర్లు ప్రకటించే అవకాశం కూడా ఉంది.













