జనసేన ఎన్ఆర్ఐ విభాగం ఏర్పాటు
జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగాన్ని ఏర్పాటు సింది. విదేశాల్లో ఉండే భారతీయులు, ప్రధానంగా తెలుగు వారిలో జన సేన అభిమానులు, కార్యకర్తలను సమన్వయం చేసేలా ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ అరబిందో విశ్వవీణ పేరుతో దీన్ని నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఆంగ్ల పదాల్లోని మొదటి అక్షరాలను తీసుకుని సవ్వి అని నామకరణం చేశారు. అరబిందో 20 ఏళ్ల ప్రాయం వరకు ఇంగ్లండ్‌లో చదివి తిరిగి భారతదేశానికి వచ్చి పరాయి పాలన నుంచి దేశాన్ని విడిపించడానికి పోరాడిన యోధుడు అయినందున ఆయన పేరును, అక్షరాలనే ఆయుధాలుగా మలుచుకుని కార్మిక, కర్షక, శ్రామిక వీరుల కోసం పోరాడిన శ్రీశ్రీ స్ఫూర్తితో విశ్వవీణ పదాన్ని తీసుకున్నారు. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను అని శ్రీశ్రీ అన్నారు. ఈ ఇద్దరి స్ఫూర్తితో శ్రీ అరబిందో విశ్వవీణ పేరును ఎన్ఆర్ఐ విభాగానికి పవన్ కల్యాణ్ సూచించారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.













