వారితో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలి
రాజధాని తరలింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్‌కల్యాణ్ సమావేశం అయ్యారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. రాజధానిపై కాంగ్రెస్, బీజేపీ తమ వైఖరి చెప్పాలని కోరారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని గుర్తు చేశారు. రాజధానిపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. భూములిచ్చిన రైతులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని సృష్టం చేశారు.













