మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేనాని..
ఎన్నికలలో ఓట్లు చీలకూడదు అనే ఉద్దేశంతో కూటమిగా కలిసి వెళ్లడానికి జనసేనాని సిద్ధపడ్డ విషయం తెలిసిందే. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ కూడా తాను ఇచ్చిన మాటకి కట్టుబడి కొన్ని సీట్లకే పరిమితమయ్యాడు పవన్. కాసేపటి క్రితం పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సీటును జనసేనకు కేటాయించారు. టీటీడీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ కు పి. గన్నవరం సీటు దక్కింది. ఇటు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన,బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయబోతున్నారు. ఈసారి గెలుపు తమదేనని.. పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తామని బాలరాజు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొదట టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ పోలవరం నుంచి టికెట్ ఆశించారు. తొలి జాబితాలో గన్నవరం సీటు మహాసేన రాజేష్ కు కేటాయించడం జరిగింది. అయితే ఈ విషయంలో వ్యతిరేకతలు ఎదుర్కొన్న కారణంగా టికెట్ మార్పు చేశారు. ఈ విషయం పై టీడీపీ లో అంతర్గతంగా కొందరు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.













