మచిలీపట్నం అభ్యర్థిని అనౌన్స్ చేసిన జనసేనాని..
కూటమిలో భాగంగా కదులుతున్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో తనదైన ముద్ర వేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. మరోపక్క పార్టీకి సంబంధించి తమ వాటాకి వచ్చిన 22 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు క్రమంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిని జనసేనాని ప్రకటించారు. మచిలీపట్నం నియోజకవర్గం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని పవన్ కల్యాణ్ ప్రకటించారు.ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పేరు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. అయితే అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాల నుంచి సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్న వారి సంఖ్య జనసేనలో భారీగా కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంతాల అభ్యర్థుల ఎంపిక పై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. సరియైన అభ్యర్థులను నిర్ణయించాలని పవన్ భావిస్తున్నారు. సర్వేల ప్రకారం గెలుస్తారు అన్న నమ్మకం ఉన్నవారికి.. సంతృప్తికరమైన ఫలితాలు అందిస్తారు అని కన్ఫామ్ గా తెలిసిన వ్యక్తులకు మాత్రమే సీటు ప్రకటించే ఉద్దేశంలో పవన్ కనిపిస్తున్నారు.













