మున్సిపల్ ఎన్నికలు.. జనసేన తుది జాబితా విడుదల
మున్సిపల్ ఎన్నికలకు జనసేన అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సరకణం శ్రీలత (Sarakanam Srilatha), ముమ్మిడివరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుబ్బల రత్న భవాని (Gubbala Ratna Bhavani)ని జనసేన ఎంపిక చేసింది. అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ పేర్లకు ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ తెలిపింది. ఇప్పటికే పలు దఫాలుదా మేయర్ ( Mayor), చైర్మన్ (Chairman) అభ్యర్థులను జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.








