యధా లీడర్, తథా కేడర్…ఇది రాష్ట్రంలో పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. మూడేళ్లలో 800 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పుస్తకంలో వెల్లడించారు. నిందితుల్లో ఎక్కువ మంది వైసీపీ నేతలేనని పుస్తకంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వంగలపూడి అనిత మాట్లాడుతూ లైంగిక వేధింపుల్లో మంత్రి అంబటి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఉన్నారని తెలిపారు. పుస్తకంలో ఒక్క అబద్ధం ఉన్నట్లు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని జగన్రెడ్డి దిగిపోవాలని డిమాండ్ చేశారు. యధా లీడర్, తథా కేడర్, ఇది రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అని అనిత సెటైర్లు వేశారు.













