శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యన్నారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం దేవస్ధానం ఛైర్మన్ రెడ్డి వారి చక్రపాణిరెడ్డి. దేవస్ధానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం శ్రీ వైయస్.జగన్ను ఆహ్వానించిన దేవాదాయశాఖమంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు.
ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 21 తేదీ వరకు జరగనున్న శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ ప్రధాన అర్చకులు.
శ్రీశైలం దేవస్ధానం క్యాలెండర్, డైరీని సీఎంకు అందజేసిన దేవస్ధానం అధికారులు.













