International Yoga Day: చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం ..గిన్నిస్ లక్ష్యంగా విశాఖలో భారీ ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) చాలా ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో ఈ వేడుకలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేడుకల్లో సామాన్య ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ (NCC), ఎన్‌ఎస్‌ఎస్ (NSS) వాలంటీర్లు, యోగా సంస్థల సభ్యులు, నేవీ (Navy), కోస్టల్ గార్డు (Coast Guard) సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కార్మికులు ఇలా ప్రతి రంగానివారు పాల్గొనాలని పిలుపునిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మహానాడు (Mahanadu) వేదికగా మాట్లాడారు. ఈ ఏడాది జూన్ 21న జరిగే యోగా దినోత్సవాన్ని విశేషంగా నిర్వహించేందుకు అద్భుతమైన ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ (RK Beach) నుంచి భీమిలి బీచ్ (Bheemunipatnam Beach) వరకూ సుమారు ఐదు లక్షల మందితో యోగా ప్రదర్శన నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవనానికి యోగా ఎంత ముఖ్యమో వివరిస్తూ, ఒత్తిడి వచ్చినప్పుడు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మంచి రిలీఫ్ కలుగుతుందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి యోగాను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత దక్కుతుంది అని కొనియాడారు. విద్యాసంస్థల్లో ఒక గంట పాటు యోగా అభ్యాసం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒకే రోజున రెండు కోట్ల మంది యోగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనికోసం యోగా ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ మహా కార్యక్రమానికి సంబంధించి విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద కాళీమాత ఆలయం (Kali Temple) నుంచి భీమిలి వరకు 127 విభాగాలుగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి విభాగంలో వెయ్యిమంది చొప్పున పాల్గొనబోతున్నారు. ప్రతి 200 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్ ఏర్పాటవుతుంది. వాటికి ప్రత్యేక ఇన్‌చార్జ్, వైద్య బృందం, వాలంటీర్లు ఉండనున్నారు. LED స్క్రీన్లు, చిన్న స్టేజీలు, శబ్ద పరికరాలు వంటి అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా చూస్తున్నారు. ఈ యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు (Guinness World Record) సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.