Retired IPS : రాజకీయాల్లోకి వస్తున్నా ..విశ్రాంత ఐపీఎస్ అధికారి
ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని విశ్రాంత ఐపీఎస్ అధికారి, నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) పేర్కొన్నారు. రాజకీయ అరంగేట్రం గురించి కోనసీమ (Konaseema ) నుంచి ప్రకటించడం యాధృచ్చికమే అయినా శుభసూచకంగా భావిస్తున్నాన ని వివరించారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని, తనతోపాటు కలిసివచ్చే వారితో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఏదైనా పార్టీలో చేరడమా? కొత్త పార్టీ పెట్టడమా? అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుందని తెలిపారు.78160 20048 వాట్సప్ నంబరులో తనకు ఈ మేరకు సూచనలివ్వాలని విన్నవించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం (Amalapuram)లో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ (Jagan) తో తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని, ఆయన రాజకీయ శైలే సమాజానికి అత్యంత ప్రమాదకరమని, ఆయన రూపంలో రాష్ట్రానికి పెను ముపుప పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.













