సీఎం వైఎస్ జగన్ ను కలిసిన భారత మహిళా హాకీ ప్లేయర్ రజనీ
ఒలింపిక్స్ లో విశేష ప్రతిభ చూపిన భారత మహిళల జట్టు హాకీ క్రీడాకారిణి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇ.రజనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రజనీకి పలు ప్రోత్సహకాలు ప్రకటించారు. రూ.25 లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో తల్లిదండ్రులతో కలిసి రజనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి అనంతరం ఆమెకు జ్ఞాపికను బహుకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్థలం, నెలకు రూ.40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.













