Minister Narayana :నిజాలు తెలుసుకోకుండా ..పనిగట్టుకొని దుష్ప్రచారం : మంత్రి నారాయణ
కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా దుష్ప్రచారం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) మండిపడ్డారు. రాజధానిలో నీరుకొండ (Neerukonda) వద్ద కొండవీటి (Kondaveeti) వాగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు, ప్రవాహానికి 25 అడుగుల లోతులో ఉండాలని అయితే, పూర్తిగా మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయని చెప్పారు. అధికారులు స్పందించి రోడ్డుకు గండికొట్టి నీటిని బయటకు పంపిచారని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం సరికాదు. అమరావతి (Amaravati )లో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ (Netherlands) వాళ్లు డిజైన్ చేశారు. రాజధాని పనులు జరుగుతుండటంతో ఇలా జరిగింది. ఒక కంపెనీ వాళ్లు తమ ఆఫీసుకు వెళ్లేందుకు వాగుమీద రోడ్డు వేసేశారు. వర్షాలకు ముందు మట్టి తొలగించి ఉంటే సమస్య ఉండేది కాదు. రోడ్డుకు గండి పెట్టిన 24 గంటల్లోనే మొత్తం నీళ్లు వెళ్లిపోయాయి. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు అని అన్నారు.







