ఏపీలో స్థానిక ఎన్నికలపై .. హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ( High Court) కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం (State Government), ఎన్నికల సంఘాన్ని(Election Commission) ఆదేశించింది. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై ఇప్పటికే విచారణ పూర్తిచేసిన హైకోర్టు తీర్పులను రిజర్వు చేసింది. ఆ పిటిషన్లపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీసీ(BC)లకు 34శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని పేర్కొంది. సర్ ప్రక్రియ ముగిశాకే స్థానిక ఎన్నికలు జరపాలంటూ వైసీపీ (YCP,) దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.







