ఫోర్సైత్ కౌంటీ విద్యా మండలి ప్రతినిధితో సమావేశమైన ఇండియన్-అమెరికన్ సభ్యులు
జార్జియా : విద్యార్థులపై, కుటుంబాలపై, విస్తృత సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపే కీలక అంశాలపై చర్చించేందుకు భారతీయ అమెరికన్ సభ్యులు సమావేశమయ్యారు. అలాగే ఫోర్సైత్ కౌంటీ విద్యా మండలిలో 5వ జిల్లా ప్రతినిధి అయిన మైక్ వాల్డెస్తో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం తమ ఆందోళనలను పంచుకోవడానికి, తమకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వాల్డెస్ నుండి నేరుగా వినడానికి, మరియు స్థానిక పాఠశాల వ్యవస్థను ప్రభావితం చేసే విషయాలలో కుటుంబాలు చురుకుగా ఎలా పాలుపంచుకుంటాయో తెలుసుకోవడానికి ఓ అవకాశం కల్పించినట్లయ్యింది. అయితే.. వాల్డెస్ కి, ఆయన తిరిగి ఎన్నికవ్వడానికి తమ మద్దతును కూడా ఈ సభ్యులు తెలియజేశారు.
సామాజిక కార్యక్రమాల కోసం ఫోర్సిత్ కౌంటీ ఉన్నత పాఠశాల సౌకర్యాలను ఉపయోగించడం అనేది చర్చించిన కీలక అంశాలలో ఒకటి. పాఠశాలలు సాంస్కృతిక, విద్యా మరియు సామాజిక కార్యకలాపాలకు ముఖ్యమైన సమావేశ స్థలాలుగా పనిచేస్తున్నందున, సౌకర్యాల లభ్యత, అద్దె ఖర్చులు, దరఖాస్తు విధానాలు మరియు షెడ్యూలింగ్కు సంబంధించిన సమాచారాన్ని వుంచాలని వీరంతా నొక్కి చెప్పారు.
ఫోర్సిత్ కౌంటీ పాఠశాలలు సామాజిక సంస్థలను పాఠశాల సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తాయి, అయితే పాఠశాల కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. తుది ఆమోదం ఇచ్చేది మాత్రం ఆయా ప్రిన్సిపాల్స్ కి మాత్రమే వుంటుంది. సామాజిక, సమూహంగా కలిసి చేసే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంపై, స్పష్టమైన సమాచారాన్ని ఎలా ఒకరినొకరు షేర్ చేసుకోవాలన్నది ఈ సమావేశం నొక్కి చెప్పినట్లయ్యింది. అయితే.. పాఠశాలల్లో భద్రతపై కూడా వీరు చర్చించారు. విద్యార్థులు విద్యా పరమైన వాటిలో రాణించడంతో పాటు, వారు అకాడమిక్ గా రాణించడంపై వుండే వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చర్చించారు. అలాగే పాఠశాల నర్సులు, కౌన్సెలింగ్ సేవలు, మానసిక ఆరోగ్య వనరులు మరియు ప్రవర్తనా మద్దతు కార్యక్రమాలతో సహా విద్యార్థుల సంక్షేమంపై కూడా విస్తృతంగా చర్చించారు.
ఇవి కూడా చదవండి
విద్యా రంగంలో కృత్రిమ మేధ (AI) పై కూడా వీరు చర్చించారు. AI సాధనాలు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు మరింత అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, విద్యాపరమైన సమగ్రత మరియు విద్యార్థుల గోప్యతను ప్రోత్సహిస్తూనే, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించేలా చూడాలని అభిప్రాయపడ్డారు.
అలాగే విద్యార్థుల సిలబస్ లో కేవలం అకాడమిక్ అంశాలే కాకుండా, మిగతా విషయాలను కూడా ప్రవేశపెట్టే విషయంపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. ఫోర్సిత్ కౌంటీలో నానాటికీ వైవిధ్యభరితంగా, బహుభాషాయుతంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా, భాషా విద్య విద్యార్థులకు విభిన్న సంస్కృతులతో మమేకమవ్వడానికి, వారి సంభాషణ నైపుణ్యాలను బలోపేతం చేసుకోవడానికి అవకాశాలను కల్పిస్తుందని సభ్యులు పేర్కొన్నారు. అలాగే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఎలా నిలుపుకోవాలి? పాఠశాలలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా చర్చించారు. మారుతున్న సమాజం, వేగంగా జరుగుతున్న అభివృద్ధి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విద్యను ఎలా అందించాలని కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను కూడా చర్చించారు.
భారతీయ అమెరికన్ సమాజానికి మరియు వారి స్థానిక పాఠశాల బోర్డు ప్రతినిధికి మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయని భారతీయ అమెరికన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ మధ్య వచ్చిన ఆలోచనలు, సంభాషణ అనేది విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తులో కచ్చితంగా మార్పులు వచ్చేలా వున్నాయని అభిప్రాయపడ్డారు.
వాల్డెస్తో నేరుగా సంభాషించి, కౌంటీ వ్యాప్తంగా విద్యార్థులు మరియు కుటుంబాలకు ముఖ్యమైన సమస్యలను చర్చించే అవకాశం లభించినందుకు సమాజ సభ్యులు ప్రశంసలు తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని ఇలాగే కల్పించాలని, దీనిని ఇలాగే కొనసాగిస్తూ, స్థానిక విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులు వచ్చేలా చూడాలని అభిప్రాయపడ్డారు.








