సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
బీసీలకు 34శాతం రిజర్వేషన్ల విషయంపై సుప్రీంకోర్టు(Supreme Court) కు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( Andhra Pradesh Government) నిర్ణయించింది. 34శాతం కోటాతో మొత్తం రిజర్వేషన్లు 50శాతం పరిమితిని దాటుతున్నాయంటూ రాష్ట్ర హైకోర్టు రెండు జీవోలను కొట్టివేసింది. బీసీ (BC)లకు 34శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం, హైకోర్టు(High Court) తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ అంశంపై తక్షణమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు.







