మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ విచారించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెషన్స్ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నారాయణకు చిత్తూరు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను గత నెల 30న సెషన్స్ కోర్టు రద్దు చేసింది. కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను మాజీ మంత్రి నారాయణ సవాల్ చేయగా, సెషన్స్ కోర్టు ఉత్వర్వులను హైకోర్టు రద్దు చేసింది.













