ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ గడువు పెంచాలంటూ వైసీపీ (YSRCP) దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( High Court) కొట్టివేసింది. ఎన్నికల నోటిఫికేషన్ (Notification) వచ్చాక జోక్యం చేసుకోలేమంటూ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. కొన్ని చోట్ల తమ అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడం కుదరలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.








