MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy )కి హైకోర్టులో తగిలింది. మద్యం కుంభంకోణం కేసులో తనను పోలీసులు (Police) అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు ఆ పిటిషన్ పై కీలక నిర్ణయం తీసుకున్న ధర్మాసనం, మిథున్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. మద్యం కుంభకోణం విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో త్వరలో ఈ కేసులో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మద్యం కుంభంకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని సిట్ అధికారుల విచారణలో తేలిందని, ఇప్పుడు ఈ కేసు తుది దశకు వచ్చిందని, ఈ సమయంలో ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని,ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయమూర్తిని కోరారు. సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra ) వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ (Dismiss) చేసింది.













