వారికి రక్షణ కల్పించాలి .. హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వైసీసీ నేతలు బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పోలీసులు రక్షణతో పాటు పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయాలని న్యాయవాది కోరారు. వెబ్ కాస్టింగ్‌పై ఈసీకి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని గుంటూరు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది.













