మండలి ప్రొటెం చైర్మన్ గా… బాలసుబ్రహ్మణ్యం

ఆంధప్రదేశ్ శాసనమండలి ప్రొటెం చైర్మన్‍గా పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. శాసనమండలి చైర్మన్‍గా ఇటీవల వరకూ కొనసాగిన ఎంఏ షరీఫ్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్ స్థానం ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్‍ను ఎన్నుకునేంతవరకూ బాలసుబ్రమణ్యం ప్రొటెం చైర్మన్ హోదాలో ఆ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తరుల్విచ్చారు.