RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక

ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ (RTC) ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దీపావళి (Diwali) కానుక ఇచ్చింది. నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్త్రాన్ని క్లియర్ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మెకానికల్‌లు, డ్రైవర్లు (Drivers) , కండక్టర్లు, ఆర్జీజన్స్ కేడర్‌లలోని ఉద్యోగులు, పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు, ఛార్జెస్ ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా పేర్కొంది.