రాజ్యసభ ఎన్నికల కోసమే… తన రాజీనామాను ఇప్పుడు
రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న కేసుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో జగన్ మాట్లాడలేదు. ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్‌ప్లాంట్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశా. దీనిని ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్‌ను కోరా. ఉప ఎన్నిక భయంతోనే ఇన్నాళ్లు ఆమోదించలేదు. రాజ్యసభ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆమోదించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్‌కు గుర్తుంది. రాజీనామాలే కాదు.. అంతకు మించిన త్యాగాలకు సిద్ధంగా ఉన్నా. సీఎం జగన్ విలువలకు పాతర వేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయగలరా? జగన్ పరిపాలనపై వైసీపీ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. నా రాజీనామా ఆమోదం వైసీపీకి చెల్లుచీటి అని వ్యాఖ్యానించారు.













