కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వైఎస్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకపోతే నేడు జగన్ సీఎం కాలేరన్నారు. వైసీపీ వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. 2004లో రాజశేఖర్ రెడ్డిని సీఎంను చేయడమే రాష్ట్ర సమస్యలన్నింటికీ కారణం అన్నారు. ఆ రోజున చేసిన పొరపాటు ఇప్పటికీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందని ఘాటూ వ్యాఖ్యలు చేశారు. విశాఖ, గుంటూరుకు త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని, స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారన్నారు. మూడు రాజధానులపై జగన్ తొందర పాటు చర్య అని, అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకోవాల్సిందని అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని స్పష్టం చేశారు. త్వరలో ఏపీ పీసీసీలో మార్పులు ఉంటాయని, నేను పీసీసీ అధ్యక్ష రేసులో లేనని అన్నారు. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా ఉన్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఉపకార వేతనాలను ఆపారంటూ మండిపడ్డారు. దీపావళి లోపు స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.













