ఏపీలో కొత్త పార్టీ.. జై భారత్ అంటున్న జేడీ..
సిఐడి అధికారిగా ఎప్పుడు వార్తల్లో నిలిచే జెడి లక్ష్మీనారాయణ.. తన పదవికి స్వచ్ఛందంగా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పోరులో సరికొత్త పార్టీ ప్రవేశించనుంది అని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం జై భారత్ అనే జాతీయ పార్టీని జేడీ ప్రకటించినట్లు టాక్. రాజకీయాలలో జేడీ ప్రవేశం ఎప్పటినుంచో అనుకుంటున్న విషయం. ఈ నేపథ్యంలో ఏదో ఒక పార్టీలో చేరి విశాఖ లోక్ సభ స్థానం నుంచి జెడి పోటీ చేస్తారు అని ప్రచారం జరిగింది.
మరోపక్క ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతాను అని స్వయంగా జేడీ లక్ష్మీనారాయణ పలు సందర్భాలలో ప్రకటించారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇదే రకంగా జెడి కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ జనసేన పార్టీలో చేరి జెడి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించాడు కానీ ఎన్నికల అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ సినిమాల వైపు వెళ్లడాన్ని జెడి తప్పుపట్టాడు. ఇక ఆ తర్వాత అతని పార్టీ నుంచి బయటికి వచ్చేసారు.
జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల లో ఆక్టివ్ గా పాల్గొంటూ తనదైన సంఘ సేవ చేశారు. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా చేపట్టారు. రీసెంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశాడు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ పార్టీలో సభ్యులు కూడా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండబోతున్నారు. మరి ఈ పార్టీ స్థాపించిన తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం లో ఉన్న ఏ పార్టీపై ఎక్కువ ప్రభావం పడుతుందో అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. జనసేన టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి వ్యతిరేకిస్తున్న కాపులు ఇప్పటికే పార్టీని విడిపోయారు. ఈ నేపథ్యంలో జేడీ స్థాపించబోతున్న కొత్త పార్టీ వార్త ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేకెత్తిస్తోంది.













