ఉమ్మడి పొత్తులో పోలవరం ఎవరికి వరం కాబోతోంది..
పోలవరం పేరు చెప్తే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది పోలవరం ప్రాజెక్టు. అయితే జాతీయ ప్రాజెక్టు ఉన్న ఈ నియోజకవర్గం లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కచ్చితంగా ప్రాజెక్టు గురించే మాట్లాడుతారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు పోలవరం. జరగబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుంది. అయితే టీడీపీ – జనసేన కూటమి కారణంగా ఇక్కడ అభ్యర్థి ఎవరు అన్న విషయంపై పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొని ఉంది. ఈ నియోజకవర్గంలో టికెట్ సైకిల్ కి దక్కుతుందా లేక గ్లాస్ ఖాతాలోకి వెళ్తుందా అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పరిచయం కార్యక్రమం పేరుతో ఇప్పటికే నియోజకవర్గ మొత్తం చుట్టేస్తోంది వైసీపీ అభ్యర్థి. అయితే ఇంకా తెలుగుదేశం, జనసేన కూటములు ఇక్కడ అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు. ఇక్కడ టీడీపీ వ్యూహం ఏమిటి అన్న విషయం ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉంది. ఏది ఏమైనప్పటికీ సైకిల్ గుర్తుకే పోలవరంలో పవర్ జాస్తి.. కాదు అని జనసేన పార్టీ క్యాండిడేట్ ను ఇక్కడ రంగంలోకి దింపితే ఓటమి ఎదుర్కొనే ఆస్కారం ఎక్కువ. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థిని త్వరగా ఖరారు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. లేకపోతే ప్రత్యర్థులు బలపడిపోతారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.













