ఫోన్ నిజంగా పోయిందా? జగన్ లాక్కున్నారా ? : జవహర్
తన ఫోన్ పోయిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢల్లీి లిక్కర్ స్కామ్‌కు సంబంధించి జగన్ సహా అందరి వాటాల సమాచారం ఆ ఫోన్లోనే ఉందన్నారు. ఈడీ విచారణలో బాగోతం బయటపడుతుందని నాటకం ఆడుతున్నారు. ఫోన్ దాచేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇస్తున్నారు. రుషికొండ వాటాల సమాచారం విజయసాయి ఫోన్లోనే ఉంది. శరత్ అరెస్టు తర్వాత విజయసాయి ఫోన్ పోయిందంటున్నారు. నిజంగా పోయిందా? జగన్ లాకున్నారా? అని ఎద్దేవా చేశారు.













