ప్రతిపక్షానికి ప్లస్ గా మారనున్న..ఎన్నికల షెడ్యూల్..
ఈసారి ఎన్నికల షెడ్యూల్ ప్రతిపక్షానికి బాగా కలిసి వచ్చేలా ఉంది అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏపీ లో మొదటి విడత లోని ఎన్నికల నిర్వహించడం జరిగింది. అప్పట్లో మార్చి పదిన షెడ్యూల్ విడుదలయితే.. మార్చి 18న నోటిఫికేషన్ వచ్చింది. అతి తక్కువ వ్యవధిలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిపోయింది. అంటే షెడ్యూల్ నుంచి పోలింగ్ ఉన్న సమయం కేవలం 32 రోజులు మాత్రమే. అయితే ఈసారి అందుకు భిన్నంగా మార్చి 16న షెడ్యూల్ విడుదల అయితే పోలింగ్ మే 13న జరగబోతుంది. అంటే షెడ్యూల్ నుంచి పోలింగ్ మధ్య 58 రోజుల సమయం దక్కుతుంది. అధికార వైసీపీ సోలోగా పోరుకు దిగుతుంటే.. ప్రతిపక్షాలు కూటమిగా దాడి చేస్తున్నాయి. ఒకేరోజులో జగన్ సింగిల్ షాట్ లో మొత్తం 175 స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మరోపక్క పొత్తుల మధ్య సీట్ల లెక్క కన్ఫ్యూజ్ చేస్తుండడంతో టీడీపీ అభ్యర్థుల పంచాయితీ ఇంకా తేలలేదు. అయితే ఎన్నికలకు ఈసారి ఎక్కువ సమయం ఇవ్వడం ప్రతిపక్షానికి బలంగా మారుతుంది అని టాక్.













