ఏపీ కేబినెట్ భేటీపై స్పందించిన ఈసీ
ఏపీ కేబినెట్ భేటీకి అనుమతిపై ఎన్నికల కమిషన్ వర్గాలు స్పందించాయి. నాలుగు అంశాలతో కేబినెట్ భేటీకి సీఎస్ అనుమతి కోరారని తెలిపాయి. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి. ఏపీ కేబినెట్ భేటీ అంశం ఇంకా తమ పరిశీలనలోనే ఉందని నేడు సాయంత్రానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపారు. రేపు కేబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశం ఈ నెల 10న జరపాల్సి ఉంది. అయితే భేటీకి సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు ఈసీకి పంపి అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించాలంటూ సీఎస్ ఎల్వీ మెలిక పెట్టిన కారణంగా సమావేశం 14వ తేదీకి వాయిదా పడింది.













