నా మాట నిజం కాకుంటే.. రాజకీయ సన్యాసం
చరిత్రలో ఎక్కడా లేనివిధంగా, ఎవరూ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జనం మదిలో చెరగని ముద్రవేసిన జగన్ మోహన్ రెడ్డి రానున్న కాలంలో కూడా ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపడతారని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణాదాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్పై ప్రతిపక్షాలు పనిగట్టుకుని చేసే విమర్శల్లో పసలేదని ప్రజలే గుర్తించారని అన్నారు. వీళ్లు ఎంతగా గింజుకున్నా భవిష్యత్లో కూడా జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని, తన మాట నిజం కాకపోతే రాజకీయ సన్యానం స్వీకరిస్తానని ఛాలెంజ్ చేశారు. అరణ్యంలో ఎన్ని జీవులున్నా వాటన్నింటినీ శాసించే రారాజు సింహం మాత్రమేనని, జగన్ అలాంటి ధీరోదాత్తుడని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రతి ఒక్కరికీమేలు జరగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు.













