ఆయనకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధం
సాగు నీటి రంగంపై ప్రతిపక్ష నేత జగన్కు ఏమాత్రం అవగాహన లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే ఆయనకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో నీరు చెట్టు కింద పెద్ద ఎత్తున జల సంరక్షణ చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని సృష్టం చేశారు. ఆ ఫలాలనే వైకాపా నేతలు అనుభవిస్తున్నారన్నారు. పులిచింతల నీళ్లు ఎక్కడకు వెళ్తున్నాయో జగన్కు తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతకు ప్రశ్నించే తత్వమే లేదని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన వ్యక్తి రోడ్లపై తిరుగుతూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.













