హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే .. ఆ పదవికి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కాకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఆ పదవికి న్యాయం చేయగలరని పేర్కొన్నారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేపట్టింది. దానిపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపివేశారు. ప్రభుత్వం ఈ నియామాలను రాజకీయ పునరావాసంగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది. టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారిని, ఆ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి అని పేర్కొన్నారు.













