ఏపీ ప్రభుత్వం సంచలనం… కోటి మందికి

కరోనా వ్యాక్సినేషన్‍లో ఆంధప్రదేశ్ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్, సెకండ్ డోసు టీకాలు అందించింది. రాష్ట్రంలో మొదటి, రెండో డోస్ తీసుకున్నవారు 1,00,17,712 మంది ఉన్నారు. మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 74,92,944గా నమోదయ్యింది. ఇక స్పెషల్ డ్రైవ్ ద్వారా రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 25,24,768గా ఉంది. రాష్ట్రంలో ఫస్ట్, సెకండ్ డోసు తీసుకున్న వారి సంఖ్య కోటీ దాటింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం మందికి టీకాలు అందించింది. వ్యాక్సినేషన్‍లో దేశ సగటును దాటేసి ఆంధప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుంది.