ఏపీలో కరోనా కేసులు 2,627
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఏ రోజుకారోజు ఏదో ఒక కొత్త దారిలో రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతూనే ఉంటున్నాయి. తాజాగా గడిచిన 24 గం•ల్లో కువైట్ నుంచి వచ్చిన 12 మందికి, దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురికి, ఖతర్నుంచి వచ్చిన ఇద్దరి కరోనా బయల్పడింది. ఓవరాల్‌గా గడిచిన 24 గంటల్లో 66 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 2627కు చేరుకుంది. 24 గంటల్లో వ్యవధిలో మొత్తం 11,557 నిర్థారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు బయటపడ్డాయి. అంతేకాక ఈ కొత్త కేసుల్లో నెల్లూరులో 8, చిత్తూరులో 3 మొత్తం 11 కేసులు కోయంబేడు మార్కెట్‌తో సంబంధమున్నవేనని వైద్యారోగ్యశాఖ తన బులిటెన్‌లో వెల్లడించింది. మరోవైపు ఇతర రాష్ట్రాల వారికి చెందిన 153 పాజిటివ్ కేసులను కూడా కలుపుకుంటే, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,757గా ఉంది.






