ఏపీలో కొత్తగా 11,573 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో 40,357 నమూనాలను పరీక్షించగా 11,573 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్మారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 22,60,181 కి చేరింది. కరోనా నుంచి ఒక్క రోజులో 9,445 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 21,30,162 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. కరోనాతో ఒక్క రోజులో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,594 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,15,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,24,06,132 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది.