ఏపీలో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 22,36,047కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 14,579 మరణాలు సంభవించాయి. కడప జిల్లాలో అత్యధికంగా 2,031 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,09,493 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,11,975 మంది రికవరీ చెందారు.