ఏపీలో విజృంభిస్తోన్న కరోనా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 8,687 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,318 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1791 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 1650, గుంటూరు 1,464, కర్నూలు 1409, ప్రకాశం 1295, నెల్లూరు 1509 కేసులు నమోదయ్యాయి. కరోనాతో తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందగా, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 14,570 మంది మృతి చెందారు.