ఏపీలో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 43,763 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 12,926 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 3,913 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 73,134 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,959, చిత్తూరు జిల్లాలో 1,566, అనంతపురంలో 1,379, గుంటూరులో 1,212 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 21,66,194 నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,538 మంది మరణించారు.