ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్యలో వేలల్లో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,516 నమూనాలు పరీక్షించగా కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 2,942 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అధ్యధికంగా విశాఖ జిల్లాలో 2,224, చిత్తూరు జిల్లాల్లో 1,585, అనంతపురంలో 1,235, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు నమోదయ్యాయి.