ఏపీలో భారీగా పెరిగిన కేసులు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా నుంచి 1,222 మంది పూర్తిగాకోలుకునన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,27,441 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 14,522 మంది మరణించారు.