తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్ స్పాట్ జిల్లాలివే!
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 170 జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా ప్రకటించింది. లాక్డౌన్ కాలం పొడిగించినందున అవకాశం ఉన్నంత మేరకు కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు. హాట్ స్పాట్ జిల్లాలతో పాటు కంటైన్మెంట్ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్‌స్పాట్ జిల్లాల జాబితా ఆంధప్రదేశ్, తెలంగాణ సీఎస్‌లకు చేరింది. ఆంధప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలను, తెలంగాణలో 8 జిల్లాలను హాట్స్పాట్లుగా ప్రకటించింది.
ఆందప్రదేశ్ హాట్‌స్పాట్ జిల్లాలివే :
విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.
తెలంగాణ జిల్లాలు :
హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజిగరి, కరీంనగర్, నిర్మల్.













