ఊహించని దహనాలు, బెజవాడలో దారుణ పరిస్థితులు, ప్రజలు జాగ్రత్త

దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం వచ్చే అవకాశాలు కనపడటం లేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పకపోయినా సరే ప్రజల్లో మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కరీంనగర్ నగరాల్లో జరుగుతున్న దహన సంస్కారాలు విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయి.
దీనికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు కూడా ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. విజయవాడలో బస్టాండ్ సమీపంలో ఉన్న స్మశానవాటికలో భారీగా దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో 300 మందిని దహనం చేశారు అనే వార్తలు వస్తున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో కూడా కొన్ని స్మశానవాటికలలో భారీగా జరుగుతున్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో మానేరు నది తీరంలో భారీగా దహన కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు.
దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని అధికారులు కూడా ప్రజలకు వాస్తవాలు వివరించడం లేదు అని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎవరూ ఊహించని విధంగా విస్తరించింది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం ఉన్నా సరే కొంతమంది అనవసరంగా బయటకు రావడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినబడుతున్నాయి. ఆక్సిజన్ కొరత కారణంగా చాలా వరకు మరణాలు పెరుగుతున్నాయి.
ఆస్పత్రులు కూడా కనికరం లేకుండా వ్యవహరించడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. భవిష్యత్తులో ఇదే విధంగా పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు ప్రభుత్వాలు తో సంబంధం లేకుండా ఎవరి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసుకోవడమే కాకుండా అనవసర కార్యక్రమాలను పెట్టుకోకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. మాస్క్ లేకుండా బయటకు రావద్దని ఇప్పుడు యువతలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో రాష్ట్రాలు స్వచ్ఛందంగా ప్రజలను కట్టడి చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. అయితే కరుణ మాత్రం ఇప్పట్లో కట్టడి అయ్యే అవకాశాలు లేవు. దాదాపు మరో నెల రోజుల పాటు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.