టీకా ఉత్సవ్ లో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కొవిడ్ వ్యాక్సిన్‌పై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆ సమయంలో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని నిర్దేశించారు. ఆ నాలుగు రోజులు కనీసంగా 24 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్ డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. దీని కోసం అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్ విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృస్టి పెట్టాలన్నారు.













